స్విట్జర్లాండ్ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా స్విట్జర్‌లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని చూపుతున్నట్లు క్లబ్ మెడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్ మెడ్ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో భారతీయులు ఎక్కువ మంది స్విట్జర్లాండ్‌లో టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ స్నో హాలిడే లీడర్, ఆసియా-పసిఫిక్ స్నో బ్రాండ్ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది.
స్విట్జర్లాండ్ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత